యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జామిలపేట్, జియాపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘట్‌కేసర్‌కు చెందిన అబ్బగాని శివ మృతి చెందాడు. మరో ముగ్గురు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు శివతో పాటు సోమయ్య, వెంకటేష్, ప్రవీణ్... జియాపల్లిలోని మిత్రుడు నరేష్ ఇంట్లే ఓ వేడుకకు హాజరై తిరుగి వస్తుండగా... ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అదుపు తప్పి ఆటో బోల్తా.. ఒకరి మృతి