ETV Bharat / state

చనిపోయిన మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వవిద్యార్థులు

పుష్కరం క్రితం పదో తరగతి కలిసి చదువుకున్నారు. అలా చదువుకున్న వారిలో ఒకరు చనిపోయిన వార్త విని చలించిపోయారు. తమ స్నేహితుని కుటుంబానికి మేమున్నామనే భరోసా కల్పించాలనుకున్నారు. అంతా కలిసి ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని తలిచారు. వెంటనే ఓ పాడి గేదేను కొనుగోలు చేసి ఇచ్చి తమ స్నేహబంధానికి చాటుకున్నారు.

old friends helped to friends family after his death in yadagirigutta

author img

By

Published : Jul 30, 2020, 5:08 PM IST

వారంతా యాదగిరిగుట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు. ప్రస్తుతం వేర్వేరు ప్రదేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి బ్యాచ్​కు చెందిన చుక్కల రాజు(35) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి మధిర గొల్లగుడిసెలు గ్రామానికి చెందిన రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ విషాద వార్త తెలుసుకొని... ఆ బ్యాచ్ విద్యార్థుల కళ్లు చెమర్చాయి. కష్టాల్లో ఉన్న స్నేహితుడి కుటుంబానికి తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. మృతుని కుటుంబానికి పాడిగేదెను కొనుగోలు చేసి అందజేశారు. తమ స్నేహితుని కుటుంబానికి భరోసాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బెలిదే అశోక్, ఫ్లెక్సీ నరేశ్​, పేరబోయిన సత్యనారాయణ, రావుల బాలకృష్ణ ,అల్లం శ్రీధర్, సుంచు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.