ETV Bharat / state

6 గంటల పాటు తాటిచెట్టుపై చిక్కుకున్న గీత కార్మికుడు.. ఆ తర్వాత..? - Nalgonda Latest News

కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు పట్టుతప్పి 6 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతనిని రక్షించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా
author img

By

Published : Oct 14, 2022, 7:48 PM IST

తాటి చెట్టుపై చిక్కుకున్న గీత కార్మికుడు.. రక్షించిన అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగొని మాసయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై చిక్కుకుపోయాడు. ప్రమాదవశాత్తు కిందకు జారిన మాసయ్య.. చెట్టు పైనుంచి కిందికి వేలాడాడు. దీనిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు, ఎక్సైజ్‌, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు.

సుమారు 6 గంటల పాటు శ్రమించి చివరకు తాడు సహాయంతో మాసయ్యను కిందకు దించారు. అనంతరం పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మాసయ్య ప్రాణాలతో కిందకు దిగడంతో అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి: 'ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ 'దత్తత' మంత్రం వినిపిస్తారు'

హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికల తేదీ ప్రకటన.. గుజరాత్​ విషయంలో ఈసీ ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.