యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోత్కూరు షటిల్ క్లబ్ చేయూతనందించింది. స్థానికంగా నివసించే నల్లమాస లింగయ్య కొన్ని రోజుల క్రితం కొవిడ్‌తో మరణించారు. లింగయ్య కుమారుడు అఖిల్‌కు రూ. 9 వేలు, 50 కేజీల బియ్యాన్ని షటిల్ క్లబ్ సభ్యులు అందజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి లింగయ్య చేసిన కృషిని సభ్యులు గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి అండగా నిలబడిన దాతలకు అఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షటిల్ క్లబ్ సభ్యులు కొప్పుల కరుణాకర్ రెడ్డి, మర్రి అనిల్ కుమార్, బోళ్ల సంపత్, ఎడ్ల శ్రీను మత్య్చగిరి, బయ్యనిరాజు, గుండగోని రామచంద్రు తదితరులు పాల్గొన్నారు
ఇదీ చదవండి: వామన్‌రావు హత్య కేసుపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం విజ్ఞప్తి