ETV Bharat / state

పోలీస్​, వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్యే

కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​ రెడ్డి సూచించారు.

yadadri bhuvanagiri district latest news

author img

By

Published : May 17, 2020, 4:36 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​ రెడ్డి దాదాపు 550 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.అనంతరం కొవిడ్​-19 పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్​-19 కట్టడికి అనునిత్యం కష్టపడుతన్న పోలీస్​, వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన...

ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీతా మహేందర్​ రెడ్డి సందర్శించారు. ధాన్యం కొనుగోలు గురించి అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. రవాణా సదుపాయం సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు శాసన సభ్యురాలు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే జిల్లా జాయింట్ కలెక్టర్ రమేశ్​తో మాట్లాడి లారీలను ఏర్పాటు చేసి రైతులకు సహకరించాలని సూచించారు.

ముస్లింలకు కానుకల పంపిణీ...

ఆత్మకూరు మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా హీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీతా మహేందర్​ రెడ్డి... ముస్లింలకు రంజాన్ తోఫా(కానుక) అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హీల్ సంస్థ ముందుకొచ్చి ముస్లింలను ఆదుకోవడం అభినందనీయం అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.