మాజీ హోంమంత్రి దివంగత నేత నాయిని నర్సింహ రెడ్డి సతీమణి అహల్య మరణ వార్త విని ప్రభుత్వ విప్, యాదాద్రి భువనగిరిజిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.
అహల్య ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించానన్నారు. నాయిని మరణం నుంచి తేరుకోక ముందే వారి సతీమణి మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. డ్రైవర్ మృతి, మరో ముగ్గురు గల్లంతు