యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించనున్న చెక్ డ్యాంకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. డ్యాం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.19 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.
చెక్ డ్యాం నిర్మాణం పూర్తైతే కొల్లూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని బావులకు, బోర్లకు నీరు అందుతుందన్నారు. దీని వల్ల పరిసర ప్రాంతాల్లోని రైతులు లబ్ధి పొందుతారని గొంగిడి సునీత చెప్పారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?