ప్రతీ తెరాస కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం చౌళ్ల రామారంలో ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బండారి నరేశ్, చింతల కృష్ణమూర్తి కుటుంబాలకు చెరో రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను తెరాస తరఫున అందజేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జ్యోతి, ఎంపీపీ అంజయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ‘మా ఇంటికి ఎవరూ రావద్దు.. మేమూ మీ ఇంటికి రాము’