ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

రైతులు పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందేందుకు రైతు వేదిక భవనాలు ఉపయోగ పడుతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డ గూడూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

mla gadari kishore kumar laid foundation for development works in yadadri bhuvanagiri district
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Jul 17, 2020, 5:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డ గూడూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ శంకుస్థాపన చేశారు. మోత్కూరు మండలంలోని దత్తప్ప గూడెంలో రైతు వేదిక భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, అనాజిపురం గ్రామంలో రైతువేదిక, దాచారం గ్రామంలో గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అడ్డగుడూరు మండలం గట్టుసింగారం, చౌళ్ల రామారం గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు.
తెలంగాణలో ముందెన్నడూ ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రైతులు కొత్త పద్ధతిలో పంటలు సాగు చేసి అధిక లాభాలు సాధించేందుకు రైతు వేదిక భవనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ తెలిపారు. అన్నదాతలు అభివృద్ధి చెందిననాడే దేశం ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, మోత్కూరు జెడ్పీటీసీ గోరిపల్లి శారద సంతోష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఇక జూనియర్, డిగ్రీ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.