ETV Bharat / state

'రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన ఘనత కేసీఆర్​దే' - Yadadri Bhuvanagiri District Latest News

ETELA RAJENDER FIRES ON CM KCR: నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని.. అమవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్‌ వ్యవహారశైలి చూస్తుంటే.. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా ఉందని వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ చెల్లని రూపాయిగా మిగిలిపోయారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

ఈటల రాజేందర్
ఈటల రాజేందర్
author img

By

Published : Sep 10, 2022, 2:10 PM IST

Updated : Sep 10, 2022, 2:42 PM IST

ETELA RAJENDER FIRES ON CM KCR: నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని, అమవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లో ఐలమ్మ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్‌ వ్యవహారశైలి చూస్తుంటే.. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌... చెల్లని రూపాయిగా మిగిలిపోయారని ఈటల రాజేందర్ విమర్శించారు.

"హుజురాబాద్​లో ఎట్లయితే డబ్బును నమ్ముకునదో. మద్యం ఏరులై పారించదో. అదే పద్ధతి ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ అవినీతికి మారుపేరు కేసీఆర్. కుటుంబ పరిపాలనకు మారుపేరు కేసీఆర్. ఇట్లాంటి వ్యక్తి దేశానికి నాయకత్వ వహిస్తా అనే మాటలన్ని చెల్లని మాటలుగా మిగిలిపోతాయి." - ఈటల రాజేందర్ భాజపా ఎమ్మెల్యే

'తెలంగాణను అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చిన సీఎం'

ఇవీ చదవండి: కేసీఆర్‌తోనే బంగారు భారత్.. జాతీయ పార్టీ స్థాపించాలని తెరాస నేతల విజ్ఞప్తి

'ఆయనే నిజమైన దేవుడు!'.. వివాదాస్పద పాస్టర్​తో రాహుల్ సంభాషణ వైరల్

Last Updated : Sep 10, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.