Missing Gold Jewelery at a Tea Shop: ఆ దంపతులు టీ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి టీ పార్శిల్ చేసి ఇమ్మని అడిగాడు. గిరాకీ ఒత్తిడితో టీస్టాల్ నిర్వాహకురాలు చాయ్ పాటు తమ దుకాణంలో భద్రపరచుకున్న బంగారు ఆభరణాలను పొరపాటున పార్శిల్లో వేసి సదరు వ్యక్తికి అందించింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు చివరకి పోలీసులను ఆశ్రయించింది. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బొజ్జ దీపిక, నరేశ్ దంపతులు టీ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి షాప్‌కి వచ్చి టీ పార్శిల్ చేసి ఇమ్మని అడిగాడు. గిరాకీ ఎక్కువగా ఉండటంతో వారు అతనికి టీ పార్శిల్ చేసి ఇచ్చారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
గిరాకీ ఒత్తిడితో టీస్టాల్ నిర్వాహకురాలు హడావుడిగా టీతో పాటు.. తాము మెరుగు పెట్టిచ్చేందుకు ఇంటి నుంచి తెచ్చుకున్న బంగారు ఆభరణాలను కూడా పొరపాటున పార్శిల్లో వేసి కొనుగోలుదారుడికి అందించింది. అనంతరం కాస్త దుకాణంలో రద్దీ తగ్గాక టేబుల్ డ్రాలో దాచుకున్న బంగారు ఆభరణాలకు బాక్స్‌ను మెరుగు పెట్టేందుకు ఇవ్వాలని వెతికింది. ఎంతా వెతికినా వారికి ఆ బాక్స్ కనిపించలేదు.
దీంతో బాధితులు చివరకి అక్కడే ఉన్న సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా.. పొరపాటున సదరు వ్యక్తికి చాయ్‌తో పాటు తమ ఇంటి నుంచి తెచ్చుకున్న ఆభరణాలను బాక్స్‌ను అతడికి కవర్‌లో వేయడం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. పార్శిల్ తీసుకున్నాక సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
పార్శిల్లో వేసిన బాక్స్‌లో చెరో తులం చొప్పున ఉంగరం, చెవి కమ్మలు, రెండు తులాల బంగారు గొలుసు ఉన్నాయని.. వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేప్టటారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును త్వరలోనే ఛేదిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: 'రక్షిత ఆత్మహత్య చేసుకోడానికి ర్యాగింగ్ కారణం కాదు'
హత్య చేసి టూర్లు.. వారం తర్వాత వచ్చి శరీరభాగాల దహనం.. నవీన్ హత్య కేసులో విస్తుపోయే అంశాలు
గన్‌తో కాల్చుకొని అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడి ఆత్మహత్య
మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో పవన్‌కు మరింత ఊరట.. అప్పటివరకు బెయిల్ పొడిగింపు