ETV Bharat / state

Gold Donation for Yadadri Temple : యాదాద్రికి వెల్లువెత్తిన విరాళాలు.. ఒంటిపై నగలు ఇచ్చిన మంత్రి సత్యవతి - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Gold Donation for Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం తాపడానికి బంగారం విరాళాలు భారీగా వస్తున్నాయి. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ రూ.2.50 కోట్ల విరాళం అందజేశారు. మంత్రి సత్యవతి రాఠోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకొని... తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Gold Donation for Yadadri Temple, yadadri donations
యాదాద్రికి వెల్లువెత్తిన విరాళాలు
author img

By

Published : Jan 2, 2022, 3:00 PM IST

Gold Donation for Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నగదు రూపంలో.. మరికొందరు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ వేర్వేరుగా రూ.2.50 కోట్ల విరాళం అందించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ 12 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు.

యాదాద్రికి వెల్లువెత్తిన విరాళాలు

ఉడుత భక్తితో ఒంటిపై నగలు

Yadadri donations : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. ప్రధాన ఆలయాన్ని సందర్శించారు. మరో రెండు నెలల్లో పునఃప్రారంభం కాబోతున్న యాదాద్రి ఆలయం... సీఎం కేసీఆర్ దృఢసంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మరింత పట్టుదలతో పనిచేసేలా సీఎం కేసీఆర్​కు శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. విమాన గోపురానికి విరాళాల సేకరణ జరుగుతోందని, తాను కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తులాల బంగారు నగలను విరాళంగా ఇచ్చారు.

యాదాద్రికి వెల్లువెత్తిన విరాళాలు

'రాష్ట్రప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 ప్రజలకు కలిసిరావాలని శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. కలలో కూడా ఊహించని విధంగా... ఈ అద్భుతం కట్టడం సృష్టించిన సీఎం కేసీఆర్​కు మరింత శక్తిని ఇవ్వాలని ఆ స్వామివారిని ప్రార్థించాను. ఒకప్పుడు యాదగిరి గుట్ట... ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు వేల మంది భక్తులు వస్తున్నారు. రూ.1200 కోట్లతో వేగంగా ఆలాయన్ని అభివృద్ధి చేశారు. ఉగాదితో పాటు మొదటి పండగగా ఆలయ పున:ప్రారంభం జరగనుండడం సంతోషకరం.'

-సత్యవతి రాఠోడ్, గిరిజన-స్త్రీ సంక్షేమశాఖ మంత్రి

దాతల విరాళాలు

విమాన గోపురానికి బంగారు తాపడం కోసం హైదరాబాద్​కు చెందిన హెటిరో గ్రూప్స్ ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డి రూ.2 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఇందులో హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున రూ.1.50 కోట్లు, తన ఫ్యామిలీ తరఫున మరో రూ.50 లక్షలు ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దామోదర్ రావు రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. హానర్ ల్యాబ్ లిమిటెడ్ తరఫున దేవరకొండ దామోదర్‌రావు రూ.50 లక్షల విరాళం అందజేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఈవో గీతారెడ్డికి ఆదివారం అందజేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి: NRI Donation for Yadadri Temple : యాదాద్రి గోపురం బంగారు తాపడానికి ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.