ఇన్ఫోసిస్, మమత ఫౌండేషన్, సేవా భారతి హైదరాబాద్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ మేనేజర్ చిప్పలపల్లి చిత్తరంజన్ సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం (డి)రాపాక గ్రామంలో కరోనా హొం ఐసోలేషన్ బాధితులకు మెడికల్ కిట్లను వితరణ చేశారు. వైస్ ఎంపీపీ ఇంటింటికీ తిరుగుతూ రోగులకు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్.. రేపాక గ్రామంలో కరోనా ఉద్ధృతి గురించి శాసనసభలో ప్రస్తావిండంపై స్పందించి హోం ఐసోలేషన్ వారికి మెడికల్ కిట్లను అందించడం జరిగిందన్నారు.
గ్రామప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు వైద్య సిబ్బందికి పల్స్ ఆక్సీమీటర్, మాస్కులు, మాత్రలతో కూడిన మెడికల్ కిట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నరేష్ కుమార్, జనరంజన్, చిప్పలపల్లి యాదగిరి, ముక్కాముల నర్సయ్య, శ్యాంసుందర్ రెడ్డి, కన్నవీరయ్య, చిప్పలపల్లి పరషరాములు, బొనుగ సుదర్షన్ రెడ్డి, లింగాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేత