యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో చేయి చేయి కలుపుదాం.. చేయూతనిద్దాం అంటూ.. 'మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్' కొంత కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.
మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్..
ఆరు నెలలక్రితం అనారోగ్యంతో మృతి చెందిన సత్తయ్య కుటుంబానికి 'మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్' నిర్వాహకులు, గ్రూపు సభ్యుల సహకారంతో రూ. 7,500లు సేకరించారు. మృతుడి భార్య రాధమ్మకు మున్సిపల్ ఛైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి చేతుల మీదుగా డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంధం శ్రీనివాసరావు, శ్రీనివాస్, సోంబాబు, కన్నయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి