యాదాద్రి జిల్లా భువనగిరి శివారులో ఉన్న వరంగల్ - హైదరాబాద్ బైపాస్ రోడ్డుకు కలిసే ఏడు రహదారుల్లో నాలుగింటిని మూసివేశారు. కరోనా ప్రబలుతున్న వేళ అనవసరమైన ప్రయాణాలు తగ్గించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. భువనగిరి పట్టణం నుంచి వెళ్లే మూడు ప్రధాన రహదారుల నుంచి మాత్రమే వాహన దారులను అనుమతిస్తామని, అత్యవసరమైన వారి వాహనాలను, తనిఖీలు నిర్వహించి నిర్ధరణ చేసుకొని ముందుకు పంపిస్తామన్నారు.
గ్రామాల్లో కూడా ప్రధాన రహదారి మీదుగానే అన్ని వాహనాలు వెళ్లేలా మిగిలిన రహదారులను మూసివేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. ఇది ప్రజల సహకారంతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి : కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!