యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతూ కొండపైన కొలువైనశ్రీ పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్వామి వారికి ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల మేళతాళ నడుమ కళ్యాణాన్ని జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని... అపురూప ఘట్టాన్ని తిలకించారు.
ఇవీ చూడండి: పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!