యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన హేమలత హైదరాబాద్లోని ఎల్బీ నగర్ జనప్రియ ఫ్యామిలీ సర్వీస్ సెంటర్లలో పని చేస్తోంది. ఓ రోజు ఎవరూ లేని సమయం చూసి తోటి ఉద్యోగి వెంకటేశ్వరరావు హేమలతపై అత్యాచార యత్నం చేయడం వల్ల ఆమె గట్టిగా అరిచింది. దానితో వెంకటేశ్వరరావు ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేసి పరారయ్యాడు.
హేమలతను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని.. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?