యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. యాదగిరిగుట్ట తెరాస అధ్యక్షులు బత్తిని అంజనేయుల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులతో కేటీఆర్ ఎంతో ఎత్తుకు ఎదిగి.. రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!