యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ఆదివారం వేళ చేపల కోసం భౌతిక దూరాన్ని మరిచి గుమిగూడారు. జిల్లాలోని బీబీనగర్ మండల కేంద్రంలోని చెరువులో చేపలు పడుతున్నారనే సమాచారం తెలుసుకున్న ప్రజలు.. ఒక్కసారిగా చెరువు వద్దకు పోటెత్తారు. చేపల కోసం వారిమధ్య తోపులాటలూ జరిగాయి. ఇంత జరుగుతున్నా ఘటనా స్థలానికి అధికారులు, పోలీసులు మాత్రం చేరుకోలేదు.
కరోనా వేళ.. చేపల కోసం పోటెత్తిన జనం
ప్రజలంతా కనీస జాగ్రత్తలు పాటించి.. కరోనా కట్టడికి సహకరించాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా, జనం మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి గాలికొదిలేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపల కోసం చెరువు వద్ద గుమిగూడిన ప్రజలు.. కరోనా విషయాన్ని గాలికొదిలేశారు.