ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు ఆటంకం - యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన కుండపోత వర్షం

యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలు నిలిచిపోయాయి.

యాదాద్రి జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు ఆటంకం
author img

By

Published : Sep 18, 2019, 3:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, రాజాపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాన కారణంగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.

Heavy rain in Yadadri district
యాదాద్రి జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు ఆటంకం

ఇదీ చూడండి: బోటు ప్రమాదంలో ఇవాళ 10 మృతదేహాలు గుర్తింపు

Intro:Tg_nlg_186_18_bhari_varsham_av_TS10134_

సెంటర్: యాదగిరిగుట్ట
జిల్లా: యాదాద్రిభువనగిరి
వాయిస్: యాదాద్రి జిల్లాలో రాత్రి కుండపోత వాన పడింది. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, రాజాపేట మండలాల్లో రాత్రి వాన దంచికొట్టింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఊర్లలోని చెరువులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తుర్కపల్లిలోని బూరుకుంట చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 40 శాతం చెరువు వరదనీటితో నిండిందని స్థానికులు చెప్తున్నారు. ఉన్నపణంగా రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి పడిన కుంభవృష్టికి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రాత్రి కురిసిన వర్షానికి కుంటలు, చెరువులకు జలకళ సంతరించుకుంది. మరోవైపు ఇంత భారీ వర్షం పడినా రియలెస్టేట్ వ్యాపారులు అక్రమంగా కాలువలను ఆక్రమించుకుని, వర్షపు నీరు వచ్చే కాలువలను పూడ్చివేయడంతో కొన్ని చెరువుల్లోకి చుక్క నీరు కూడా రాలేదు.Body:Tg_nlg_186_18_bhari_varsham_av_TS10134_Conclusion:Tg_nlg_186_18_bhari_varsham_av_TS10134_

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.