తాత చితికి మనవరాలు తలకొరివి పెట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని ధర్మాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జటంగి నర్సయ్య (72) గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం మృతిచెందారు.
మృతుడికి కుమారుడు, కూతురు ఉండగా.. కుమారుడు 8 సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుమారుడి చిన్న కూతురు ఊహ తాత చితికి తలకొరివి పెట్టి పలువురిని కంటతడి పెట్టించింది.
ఇవీ చూడండి: మద్యం మత్తులో బావిలో దూకిన వ్యక్తి మృతి