యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం, రాజపేట మండలాల్లో శనివారం సాయంకాలం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులలకు రాజపేట మండలంలోని మామిడి కాయలు నేలరాలాయి.
మేడిపల్లి, రాంలింగంపల్లి, మర్యాల ,చీకటిమామిడి, చౌదర్ పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.