యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, బొమ్మలారామరం మండలాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పంపిణీ చేశారు. తుర్కపల్లి మండలంలో 11 మంది లబ్దిదారులకు రూ.3,61,500 చెక్కులను అందజేశారు.
బొమ్మలరామారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 19 మంది లబ్దిదారులకు రూ.5,54000 చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైట్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ నేటి నుంచే ప్రారంభం