హైదరాబాద్ ఎల్బీనగర్లో కామాంధుడు వెంకటేశ్వరరావు చేతిలో హత్యకు గురైన హేమలత కుటుంబసభ్యులను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో ఉన్న వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.
హేమలత కుటుంబసభ్యుల గురించి అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలో ఇటీవల కులాంతర వివాహం చేసుకున్న జంటను కలిసి వారికి అభినందనలు తెలిపారు.