యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉత్తరదిశలో ఫ్లోరిగ్ పనులను మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే పరిచిన నల్లరాతిని పటిష్ఠ పరిచేందుకు తగు చర్యలు చేపట్టామని ఆర్అండ్బీ అధికారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బాలాలయం వైపు చదును చేస్తున్నామని పేర్కొన్నారు. వీటితోపాటు మాఢవీధుల్లో నీటి పారుదల కాలువల పైకప్పులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో పడమటి దిశలో రథశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
ఆహ్లాదంగా ఆలయం నగరి
దేవుడి ఆరాధన భక్తుల ఆహ్లాదానికి ఆలయ నగరిలో వివిధ పూల మొక్కలు, పచ్చని పచ్చిక బయళ్లతో ఆవిష్కృతమైంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధిలో యాత్రికుల విడిది కోసం... కొండ కింద పెద్ద గుట్టపై కాటేజీలు, విల్లాల నిర్మాణానికి 'యాడా' ప్రణాళిక రూపొందించింది.
తొలుత 250 ఎకరాల్లో చేపట్టిన లేఅవుట్లో విశాలమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీరుపారుదలతో సహా విద్యుత్ స్తంభాలు, ఏర్పాటయ్యాయి. యాత్రికుల మనోవిల్లాసానికి పలు రకాల పూల మొక్కలు పచ్చిక బయళ్లతో మినీ పార్క్లో సిద్ధం చేశారు. పెద్ద గుట్టపై ఏర్పాటు చేసిన రహదారి ఇరువైపులా గల ఆహ్లాదంగా పూల మొక్కల పెంపకం చేపట్టారు. వివిధ రకాల పూల మొక్కలు, ప్రతిరోజు పూసే పుష్పాలు, ఆలయ నగరిలో పచ్చదనంతో వీధులు, మధ్యలో వలయాకారంలో రంగులరాట్నం వలె పుష్పాలతో చక్కటి ఆకర్షణతో తీర్చిదిద్దారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో పచ్చదనానికి డ్రిప్ ఇరిగేషన్