యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అధికారి స్వప్న ఆధ్వర్యంలో నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నియంత్రిత పంటల సాగు కార్యాచరణ జరుగుతోందని ప్రతి రైతు ఈ సూచనలు పాటించాలని కోరారు.
సన్న రకం వరి పండించాలి
ఇందులో భాగంగా వరి పండించే రైతులు అధిక శాతం సన్న రకాలను మాత్రమే పండించాలని, మూస పద్దతిలో అందరు ఒకే రకమైన పంటలను కాకుండా పంటమార్పిడి పద్దతులను పాటించాలని కృష్ణారెడ్డి కోరారు. ఈ విధానం వల్ల అధిక దిగుబడితో పాటు భూ సారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులు వారికి వారే స్వతహాగా భూములు ఏ పంటలకు అనుకూలమో వాటినే పండించాలని పేర్కొన్నారు. కేవలం నియంత్రిత సాగు ద్వారానే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. ప్రతి రైతు పండించే పంట వివరాలు మండల వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నమోదు చేసుకోవాలని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్లో నకిలీ అధికారుల హల్చల్