యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తోన్న యువకుడు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన స్థానికులు భువనగిరి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మరమ్మతులు చేపట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
ఈ ఘటనపై తుర్కపల్లి ఏఈ స్పందించారు. సింగిల్ ఫెజ్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా షాక్ కొట్టిందని తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం భాగనే ఉందన్నారు.