యాదాద్రి భూవనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కూరగాయల మార్కెట్లో ఓ వ్యాపారికి కరోనా సోకింది. విషయం తెలుసుకున్న తోటి వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం వందలాది మంది వచ్చే మార్కెట్‌ను ఆదివారం వరకు మూసివేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న దివిస్ ల్యాబరేటరీస్ సంస్థ పురపాలికలోని 20 వార్డుల్లో, మార్కెట్ అంతటా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తోంది.
అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన 4 క్వారంటైన్ కేంద్రాలకు 36 లక్షల విలువైన పరికరాలు అందించారు. చౌటుప్పల్ చుట్టుపక్కల గ్రామాలకు సోడియం, బ్లీచింగ్ పౌడర్లను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలకు ఉచితంగా మాస్కులు అందజేయాలని 8 లక్షల విలువైన నూలు వస్త్రాలను డీఆర్డీఏ ఇచ్చింది. కరోనా కట్టడికి తాము అందిస్తున్న సహకారానికి ప్రజలు కూడా తోడ్పాటు ఇవ్వాలని దివిస్ సీఎండీ సుధాకర్ కోరారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం