లాక్డౌన్ నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో తెరాస ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందించారు.
ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో మే ఏడో తేదీ వరకు లాక్డౌన్ పొడగించినందుకు ప్రజలందరూ ఇళ్లలోనుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.