యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ ధ్రువీకరించారు. మహారాష్ట్ర నుంచి ఈనెల 12 న ఆరుగురితో కూడిన ఓ కుటుంబం సొంత గ్రామానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని హోంక్వారంటైన్లో ఉంచారు.
ప్రతిరోజు వారికి వైద్య పరీక్షలు నిర్వహించే క్రమంలో అందులో ఒకరికి దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలగడం, శరీర ఉష్ణోగ్రతల్లో తేడా కన్పించడం వల్ల ఈనెల 15న హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.
అతని తండ్రికి కూడా అవే లక్షణాలు ఉండడం వల్ల వైద్య పరీక్షల కోసం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించగా… అతనికి కూడా కరోనా పాజిటివ్ తేలిందని మండల వైద్యాధికారి వెల్లడించారు.
ఇవీ చూడండి: ఉద్యోగికి కరోనా వస్తే ఆఫీస్ మూసేయాలా?