ETV Bharat / state

మోత్కూరు మండలంలో 22మందికి కరోనా పాజిటివ్​ - మోత్కూరు మండలం కొవిడ్ వార్తలు

కరోనా రెండో దశలో క్రమక్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఒక్కరోజే 22మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.​ ప్రజలు కొవిడ్​ జాగ్రత్తలను తప్పక పాటించాలని వైద్యులు సూచించారు.

Corona cases, covid cases, Mothkur mandal

author img

By

Published : Apr 23, 2021, 7:40 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో గడిచిన 24 గంటల్లో 22 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 61 రాపిడ్ టెస్ట్​లు నిర్వహించగా.. 23మందికి నిర్ధరణ అయినట్లు వైద్యులు డాక్టర్ కిశోర్ కుమార్, డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.

కరోనా రెండో దశ రోజు రోజుకు విస్తరిస్తున్నందున.. ప్రజలు కొవిడ్​ జాగ్రత్తలను తప్పక పాటించాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా.. టెస్టులు చేయించుకోవాలన్నారు. పటిమట్ల గ్రామంలో 3 కేసులు నమోదు అయ్యాయి.

ఇదీ చూడండి: ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.