ETV Bharat / state

రబ్బర్​లా సాగుతోన్న అన్నం.. బియ్యం దుకాణం వద్ద ఆందోళన - మోత్కూరు ప్లాస్టిక్​ బియ్యం ఆందోళన

బియ్యం దుకాణం ముందు వినియోగదారులు ఆందోళనకు దిగారు. బియ్యాన్ని ఎంతసేపు ఉడికించినప్పటికీ రబ్బర్​మాదిరిగా సాగుతోందని.. ప్లాస్టిక్​ బియ్యం అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ ఘటన భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో జరిగింది.

Consumers worried in front of the store that plastic rice was being sold at mothkur in yadadri bhuvanagiri
రబ్బర్​లా సాగుతోన్న అన్నం.. బియ్యం దుకాణం వద్ద ఆందోళన
author img

By

Published : Feb 7, 2021, 10:44 PM IST

బియ్యాన్ని ఎంత ఉడికించినా.. రబ్బర్​లా సాగుతోందని వినియోగదారులు బియ్యం షాపు ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగింది. ఓ వ్యక్తి తమ యూనియన్ మీటింగ్​లో మధ్యాహ్న భోజనాల కోసం స్థానిక సోమ సంతోష్ దుకాణంలో 8 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేశారు. వాటిని అన్నం వండేందుకు ఎంతసేపు ఉడికించినా.. ఉడకకపోగా రబ్బర్​లా సాగుతోందన్నారు. బంతిలా ఎగరడంతో సదరు వ్యక్తులు ప్లాస్టిక్ బియ్యంగా భావించి దుకాణం ముందు ఆందోళనకు దిగారు.

మంచి బియ్యమే ఇచ్చానని.. స్టీం సరిగా కాకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తాయని షాపు యజమాని అన్నాడు. ఆ బియ్యానికి బదులుగా మరో బస్తాలోని బియ్యం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. సర్దిచెప్పారు.

ఇదీ చూడండి: రెండు వాహనాలను ఢీకొట్టిన అంబులెన్స్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.