అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన భాజపా నాయకులను యాదగిరిగుట్టలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన తమను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, ఎంపీటీసీ దాచేపల్లి రాజు, మండల ప్రధాన కార్యదర్శి సీదేశ్వర్ ఉన్నారు.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్, భాజపా ఎంపీలు కలిసి వస్తారో... రారో తేల్చుకోవాలి'