భువనగిరి నియోజకవర్గంలో పలు సమస్యలను... కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, చిట్యాల రైల్వేస్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని... రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి లేఖ రాశారు. భువనగిరిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ... క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ సమర్పించారు.
క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటే యువతకు మేలు చేసినట్లు అవుతుందని వివరించారు. నియోజకవర్గంలో చెరువులు, కుంటలు పెద్ద సంఖ్యలో ఉన్నందున.. నీటి క్రీడలను ప్రోత్సహించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. తాను చేసిన వినతులను సావధానంగా విన్న కేంద్ర మంత్రి తగిన మేరకు నిధులు సమకూర్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.