యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు అందించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నల్గొండలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన