ETV Bharat / state

Baby Snake: గంటసేపు అందరినీ ఆగం చేసిన పాముపిల్ల.. చిక్కినట్టే చిక్కి..! - పాలడైరీలోకి పాముపిల్ల

ఓ చిన్న పాముపిల్ల గంటసేపు అందరినీ ఆగం చేసింది. దారితప్పి పాలడైరీలోకి వచ్చిన ఆ పాముపిల్ల.. దాన్ని పట్టేందుకు వచ్చిన వ్యక్తిని కాసేపు ఆటాడించింది. చేతికి దొరికినట్టే దొరికి.. తుర్రుమంటూ అతడి బైక్​లోకే దూరింది. పార్టులన్ని విప్పదీస్తే గానీ.. చిక్కలేదు.

baby-snake-kalakalam-in-bhuvanagiri
baby-snake-kalakalam-in-bhuvanagiri
author img

By

Published : Sep 10, 2021, 9:24 PM IST

ఓ ద్విచక్రవాహనంలోకి పాము పిల్ల దూరి కాసేపు అందరినీ హైరానా పడేలా చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కిసాన్​నగర్​లో ఓ పాలడైరీలోకి ఓ పాము పిల్ల వచ్చింది. డైరీ యజమాని శ్రీను దాన్ని గమనించి వెంటనే.. పాములు పట్టే వారికి సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి సూర్య... రాళ్లలో దాకున్న పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పాము తోకను పట్టుకోగా అది తెగిపోయింది.

గంటసేపు అందరినీ ఆగం చేసిన పాముపిల్ల.. చిక్కినట్టే చిక్కి..!

చేతికి దొరికినట్టే దొరికి జారిపోయిన పాము... నేరుగా దాన్ని పట్టుకునేందుకు వచ్చిన సూర్య ద్విచక్రవాహనంలోకే దూరింది. సూర్య తన బైక్​ను సమీపంలోని మెకానిక్​షాప్ దగ్గరికి తీసుకెళ్లాడు. మెకానిక్ సాయంతో ఒక్కో పార్టు విప్పి చూశాడు. బైక్​ పార్టులన్ని విప్పదీసాక గానీ.. పాము కనిపించలేదు. పెట్రోల్​ ట్యాంక్​ కింద ఉన్న పాము పిల్ల చివరికి బైక్​ను వదిలి నేలపై పడింది. కిందపడ్డదాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన సూర్యను కొంత ఊరుకులు పరుగులు పెట్టించింది. ఎట్టకేలకు సూర్య తన చాకచక్యంతో పామును పట్టుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు గంటకు పైగా అందరినీ ఆ పాము పిల్ల ఆగం చేసింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.