యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో.. ఊంజల్ సేవా మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారిని.. పువ్వులు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు.. మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ... పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల లాలిపాటలతో అమ్మవారిని కొనియాడారు. ఈ ఉత్సవంలో.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అర మీటరు బెండకాయ అదిరింది గురూ!