యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వివిధ స్టోరేజ్ గోదాముల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆలేరు పట్టణంలోని తిరుమల్ రెడ్డి లింగారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా... రాష్ట్రంలో అమ్మకాలు నిలిపివేసిన గ్లైపో సైట్ కలుపు మందు నిల్వలు గుర్తించారు. లైసెన్స్, బిల్లులు లేని 410 లీటర్ల గ్లైపో సైట్ను సీజ్ చేశారు. ఈ మందును ఎక్కడి నుంచి కొనగోలు చేశారనే విషయంపై అధికారులు ఆరా తీశారు.
ఇవీ చూడండి: ఈనెల 26 లేదా 27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన