ETV Bharat / state

7 టన్నుల అమ్మోనియం నైట్రేట్​ స్వాధీనం - CRIME NEWS IN TELANGANA

భువనగిరిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7 టన్నుల అమ్మోనియం నైట్రేట్​ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

7 TONS OF AMMONIUM NITRATE SEIZED AT BHUVANAGIRI

author img

By

Published : Feb 15, 2020, 9:12 PM IST

డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 7 టన్నుల అమ్మోనియం నైట్రేట్​ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్​స్టేషన్​లో అప్పగించారు.

పాహిల్వాన్​పూర్​లోని బుచ్చిరెడ్డికి చెందిన గోదాం నుంచి అమ్మోనియం నైట్రేట్​ను వరంగల్​కు తరలిస్తుండగా... పోలీసులకు సమాచారమందింది. అప్రమత్తమైన పోలీసులు భువనగిరిలోని గంజి మార్కెట్ వద్ద మాటు వేసి... నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు బుచ్చిరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

7 టన్నుల అమ్మోనియం నైట్రేట్​ స్వాధీనం

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.