యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మండల పరిధిలోని వారికి ర్యాపిడ్ టెస్ట్లు చేయగా అందులో 31 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందని వెల్లడించారు. మండలంలో 31 కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.
లక్షణాలు ఉన్నవాళ్లు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని... కరోనా పాజిటివ్ వచ్చినవారు ఆందోళన చెందకూడదని చెప్పారు. వైద్యుల సలహాలతో హోం ఐసోలేషన్లో ఉంటూ.. చికిత్స తీసుకోవాలని సూచించారు. లక్షణాలు తక్కువగా ఉన్నా... పాజిటివ్ వ్యక్తులు వీధుల్లో తిరగకూడదని వెల్లడించారు.
మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నమోదైన కరోనా వివరాలు
- మోత్కూర్-16
- ఇందిరానగర్-5
- కొండగడప-1
- దత్తప్పగూడెం- 3
- మూసిపాట్ల- 1
- పాలడుగు-2
- సదర్ షాపురం- 1
- ఉప్పలపాడు- 1
- చౌళ్ల రామరం-1