ETV Bharat / state

టంగుటూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తాజా వార్త

యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూరు గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్టు భువనగిరి డీసీపీ నారాయణ తెలిపారు. దాదాపు 150 మంది పోలీసులతో సోదాలు చేపట్టారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు, అక్రమంగా విక్రయిస్తున్న మందుబాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

150 police men did carder search in yadadri bhuvanagiri aleru
టంగుటూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Feb 26, 2020, 11:57 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరులో డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్మకం, అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీన పరచుకున్నారు. సరైన ధృవ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్​ చేశారు. నేరాలను అరికట్టేందుకు ప్రజలకు భరోసా ఇచ్చేందుకే ఈ తనిఖీలు నిర్వహించినట్లు డీసీపీ పేర్కొన్నారు. గ్రామంలో భద్రతను దృష్టిలో పెట్టికుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో దాదాపు 150 మంది పోలీసులు పాల్గొన్నారు.

టంగుటూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి : 'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.