వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో ఆరూరి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. పోటీలను ప్రారంభించారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
![wardhannapet mla aroori ramesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-02-14-mla-cricket-sandhadi-av-ts10077_14122020151804_1412f_01807_38.jpg)
![wardhannapet mla aroori ramesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-02-14-mla-cricket-sandhadi-av-ts10077_14122020151804_1412f_01807_1056.jpg)
![wardhannapet mla aroori ramesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-02-14-mla-cricket-sandhadi-av-ts10077_14122020151756_1412f_01807_1083.jpg)
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామని రమేశ్ తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా ఆడుకోవాలని సూచించారు.
- ఇదీ చూడండి : మహిళల ప్రపంచకప్-2022 షెడ్యూల్ వచ్చేసింది