రైతు వేదికలను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. ఐనవోలు మండలంలోని కొండపర్తి, ఐనవోలు, గరిమల్లపెళ్లి, రాంనగర్, పంతిని గ్రామాల్లో రైతు వేదికలను నిర్మాణ పనులను పరిశీలించారు. రైతుల అవసరాల కోసం ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టిందని తెలిపారు.
ప్రభుత్వం రైతు వేదికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో దసరాకు ప్రారంభించేందుకు అనుగుణంగా నిర్మాణ పనులలో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కేంద్రాన్ని నిలదీయడానికి వెనకాడం: సీఎం కేసీఆర్