Warangal Traffic problems: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ప్రఖ్యాతిగాంచిన నగరం ఓరుగల్లు. దానితోపాటు హనుమకొండ, కాజీపేట, వరంగల్ పక్కపక్కనే ఉండటంతో ట్రైసిటీస్‌గా సైతం ప్రసిద్ధి. చారిత్రకంగా సైతం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ నగరం వందలసంఖ్యలో వాహనాలు, వేలసంఖ్యలో ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా రహదారుల విస్తీర్ణం లేకపోవటం, కూడళ్ల వద్ద పోలీసులు సరైన విధులు నిర్వహించకపోవడంతో ట్రాఫిక్ అస్తవస్త్యంగా మారింది.
దీనికి తోడు వాహనదారులు సైతం ట్రాఫిక్ నియమాలు సరిగ్గా పాటించకపోవడంతో నగరంలో వాహనాల రద్దీ సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. వాహనాల రద్దీని క్రమబద్దీకరించాల్సిన ట్రాఫిక్‌సిబ్బంది జరిమానాలే లక్ష్యంగా ఫోటోలు తీస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. రద్దీ ప్రాంతాలలో సైతం పోలీసులు జరిమానాలపైనే దృష్టి కేంద్రికరిస్తుండటంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకున్నా ఇష్ఠారీతీన ఫోటోలు తీస్తున్నారని నగరవాసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీసులు ఇప్పటికైనా.. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిసారించాలని కోరుతున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ ట్రాఫిక్ క్రమబద్దీకరణపై దృష్టి సారించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
"కేయూ జంక్షన్, అశోక జంక్షన్లో పది రోజుల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయలేదు. వాటిని మాత్రం ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరు. వాళ్ల దృష్టి ఎంత వరకు వాహనాలను ఫోటో తీసి జరిమానాలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరితో సమస్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు."- స్థానికుడు
ఇవీ చదవండి: