వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతతో పాటు విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. ఓ మహిళతో పాటు ఐదుగురిని అరెస్టు చేసి... పది లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసకున్నట్లు నగర సీపీ రవిచందర్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన మహిళా నిందితురాలు తక్కువ మొత్తానికి గంజాయి కొని వరంగల్‌లో ఉన్న నలుగురికి అందజేసేది. గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి కళాశాల విద్యార్థులకు, యువతకు అమ్మే వారని సీపీ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో కాపుకాసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసుల వెల్లడించారు.
చైన్‌స్నాచింగ్ దొంగ అరెస్ట్
గంజాయి ముఠాతో పాటు నగరంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని హన్మకొండ పోలీసులు పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడి నుంచి రెండు లక్షల 60 వేల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్యారేలాల్‌గా గుర్తించారు.
ఇదీ చూడండి: భారీగా డ్రగ్స్ స్వాధీనం.. నిందితులకు పాక్‌తో సంబంధాలు!