రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మర్యాద పూర్వకంగా కలిశారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన సీపీ పుష్పగుచ్ఛాలను అందజేశారు.
కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రులు సూచించారు. గతంలో ఇక్కడ పనిచేసినా అనుభవం ఉపయోగపడుతుందని ఎర్రబెల్లి అన్నారు. నగర ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని నూతన సీపీ తరుణ్ జోషికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు