ETV Bharat / state

ఓరుగల్లు నగర మేయర్​గా గుండా ప్రకాష్ రావు

వరంగల్‌ నగర కొత్త మేయర్‌గా... 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాశ్‌రావు ఎన్నికయ్యారు. ఇవాళ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో సమావేశమైన కార్పొరేటర్లు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/27-April-2019/3124202_mayor_wgl.mp4
author img

By

Published : Apr 27, 2019, 5:54 PM IST

చారిత్రక నగరమైన ఓరుగల్లుకు కొత్త మేయర్ ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ... తెరాస అధినాయకత్వం 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాష్ రావును ఎంపిక చేసింది. ఈసారి మేయర్ స్థానానికి గట్టి పోటీ ఉండడంతో... తెరాస ప్రధాన కార్యదర్శి బాలమల్లును వరంగల్​కు పంపించారు. రెండు రోజుల పాటు కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయాలను బాలమల్లు తెలుసుకుని అధిష్ఠానానికి నివేదించారు. సమర్ధత, అనుభవం, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మద్దతు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం... పార్టీ సీనియర్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గుండా ప్రకాష్ రావు​ను మేయర్ పదవికి ఎంపిక చేశారు.

మేయర్ ఎన్నికపై నగర పాలక సంస్ధ కౌన్సిల్ హాల్లో ఈ రోజు ఉదయం కార్పొరేటర్లంతా సమావేశమై గుండా ప్రకాష్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వ్యవహరించారు. కార్పొరేటర్‌ వద్దిరాజు గణేశ్‌ ప్రకాశ్‌రావు పేరును ప్రతిపాదించగా... మిలిగిన వారంతా బలపరిచారు. కార్పొరేటర్లు ఎవరూ పోటీకి రానందున... ప్రకాశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు.

మూడు దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం కలిగిన గుండా ప్రకాష్ రావు తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండుసార్లు మునిసిపల్ కౌన్సిలర్​గా, మరో రెండు సార్లు నగరపాలక సంస్థ కార్పొరేటర్​గా ఎన్నికైన ప్రకాష్ రావు... తెరాస రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. మేయర్​గా తనను ఎంపిక చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ.... ఒకింత భావోద్వేగానికి గురై.. కంట తడిపెట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌తో పాటు ఎమ్మెల్యేలూ... కొత్త మేయర్​కు అభినందనలు తెలియజేశారు. కార్పొరేటర్లు, నగర ప్రముఖులు, పరిచయస్తులు ప్రకాష్ రావును పూలమాలలతో సత్కరించారు.

ఓరుగల్లు నగర మేయర్​గా గుండా ప్రకాష్ రావు

ఇవీ చదవండి: 4వ దశ ఎన్నికల ప్రచార అంకం సమాప్తం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.