ప్రతి 1,000 మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా వరంగల్ మహానగర పాలక సంస్థ దూసుకుపోతోంది. స్వచ్ఛ సర్వేక్షన్లో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు కమిషనర్ పమేలా సత్పతి... అన్ని వనరులను ఉపయోగించుకుంటూ వినూత్న మార్గాల్లో నగరాన్ని అందంగా తీర్చిదిద్ది నగరవాసులకు మౌలిక వసతులను అందజేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాలు...
మురికివాడల్లో సామాజిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన కమిషనర్... బహిరంగ మలమూత్ర విసర్జనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మహిళల ఇబ్బందులను గుర్తించిన కమిషనర్ వారికి అనుగుణంగా ఏర్పాటు చేయగా... బహిరంగ ప్రదేశాలు ప్రాంతాలు మార్కెట్, రైల్వే స్టేషన్, బస్ ప్రాంగణాలు జాతరలకు అనుగుణంగా ఉండేవిధంగా బస్సులోనే తన ఆలోచనకు అనుగుణంగా షీ టాయిలెట్‌గా మార్చారు.
త్వరలోనే అందుబాటులోకి...
మొదటగా హైదరాబాద్ నుంచి షీ టాయిలెట్‌గా మారిన బస్సులను వరంగల్‌కి తెప్పించారు. ఈ బస్సులను గ్రేటర్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్ఈడీ విద్యుత్ కాంతులతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకునే విధంగా షీ టాయిలెట్స్ రూపొందించారు.
ఇవీచూడండి: ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్