ETV Bharat / state

ఆ విషయంలో.. పోలీసులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు

author img

By

Published : Jun 13, 2021, 10:19 PM IST

ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు చోటు దక్కించుకున్నారు. కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నందుకు గానూ వరంగల్​ కమిషనరేట్​ను ఎంపిక చేసింది.

World Book of Records
కరోనా కట్టడిలో వరంగల్​ పోలీసుల కృషికి అంతర్జాతీయ గుర్తింపు

కరోనా సమయంలో వైరస్​ వ్యాప్తి నియంత్రణకు వరంగల్​ కమిషనరేట్​ పోలీసులు తీసుకున్న చర్యలకు గుర్తింపు లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో బెస్ట్ పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరిలో పోలీసులకు చోటు దక్కింది. దీనికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల చేతుల మీదుగా... వరంగల్ సీపీ డాక్టర్​ తరుణ్ జోషి త్వరలో అందుకోనున్నారు.

కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎంపిక చేశారు. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందింది.

ఇదీ చదవండి: తీవ్ర ఇన్​ఫెక్షన్​కూ భారతీయ టీకాలు చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.