ETV Bharat / state

ఇన్​స్టంట్​ 'లోన్'​ యాప్​ల​పై కమిషనర్​ వీడియో సందేశం

ఆన్​లైన్​ 'ఇన్​స్టంట్​ లోన్'​ యాప్​ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్​ పోలీస్​ కమిషనర్​ సూచించారు. చట్టబద్ధత లేని యాప్​లను నమ్మొద్దని.. రిజర్వ్​ బ్యాంకు ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు తీసుకోవాలని తెలిపారు. ఇటువంటి యాప్​లపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సంక్షిప్త ప్రచార వీడియో సందేశాన్ని ఆవిష్కరించారు.

warangal commissioner video message on online instant loan apps
ఇన్​స్టంట్​ 'లోన్'​ యాప్​ల​పై కమిషనర్​ వీడియో సందేశం
author img

By

Published : Dec 26, 2020, 12:54 PM IST

ఆన్​లైన్ 'ఇన్​స్టంట్ లోన్' యాప్​లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్​కుమార్.. ప్రజలకు సూచించారు. ఇటువంటి రుణ యాప్​లపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపొందించిన సంక్షిప్త ప్రచార వీడియో సందేశాన్ని సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ల ఇన్​ఛార్జ్​లు, సైబర్ క్రైం ఇన్​స్పెక్టర్​కో కలిసి ఆవిష్కరించారు.

అధిక వడ్డీలతో వేధింపులు

ఈ మేరకు రుణ యాప్​ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ కమిషనర్​ ఓ ప్రకటన చేశారు. సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, వ్యాపారస్థులు ఇటువంటి యాప్​లకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తీరా రుణాలు తీసుకున్నాక అధిక వడ్డీ, ఛార్జీల పేరిట యాప్ నిర్వాహకులు రుణ గ్రహీతల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని వివరించారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ముందుస్తుగా కుదిరిన ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తూ రుణ గ్రహీతల ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుంటున్నారని సీపీ వెల్లడించారు.

ఇన్​స్టంట్​ 'లోన్'​ యాప్​ల​పై కమిషనర్​ వీడియో సందేశం

'ఇది చట్టరీత్యా నేరం. ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలి. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్, ఆధార్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియజేయకండి. ఇలాంటి వ్యక్తులు, సంస్థల నుంచి అప్రమత్తంగా ఉండాలి.'

ప్రమోద్​ కుమార్​, వరంగల్​ పోలీస్​ కమిషనర్​

సమాచారం అందించండి

రుణాల విషయంలో యాప్​లు వేధింపులకు గురిచేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ తెలిపారు. డయల్ 100 లేదా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 9491089257కు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: భాజపా ఆర్​టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.